టూత్‌పేస్ట్ చరిత్ర
మన దంతాలు తళతళలాడుతూ ఉండటానికి రకరకాల పేస్టులను వాడుతున్నా 1850 వరకు దంతాలను తోమడానికి గట్టి పదార్థాలనే ఉపయోగించేవారు. ఎందుకంటే పళ్ల పైని గారలు తొలగాలంటే రఫ్‌గా రుద్దాలని అనుకునేవారు.
ఈజిప్ట్‌లో ఉప్పు గాలికి తుప్పుపట్టిన రాగి, ఇత్తడి రజనును దంత ధావనానికి ఉపయోగిస్తే, చైనీయులు చేప ఎముకల్ని పొడిచేసి వాడేవారు. అరబ్బులు సన్నని ఇసకతో, యూరోపియన్లు ఆసిడ్‌లతో, పశ్చిమ దేశాలు టేబుల్ సాల్ట్‌ని ఉపయోగించి పళ్లు తోముకునేవారు.
క్రీ.శ. 23-79 మధ్య కాలంలో అయితే కొన్ని నమ్మకాలు కూడా ఉండేవి. మేకపాలు తాగితే శ్వాస బాగా ఉంటుందని, ఎలుక, కుందేలు, తోడేలు, ఎద్దు తలకాయల్ని, మేక పాదాల్ని కాల్చి వాటి బూడిదతో పండ్లు తోమితే చిగుళ్లు బలంగా ఉంటాయని నమ్మేవారు. ఇండియాలో మొదట్నించీ వేపపుల్లని దంతాలకు శ్రేష్టమైనదిగా భావించేవారు.
దంతవైద్యుడు, కెమిస్ట్ అయిన వాషింగ్టన్ తొలిసారిగా టూత్‌పేస్టును కనుగొన్నాడు. మంచి శ్వాస కోసం అందులో 'స్ట్రా బెర్రీ'లను వాడేవాడట.
పందొమ్మిదో శతాబ్ది చివరలో ప్యారిస్‌కు చెందిన లూసియస్ పేస్టుని మెటల్ ట్యూబ్‌ల్లో పెట్టి మార్కెట్లోకి విడుదల చేశాడు.
ఇరవయ్యో శతాబ్దం నాటికి మౌత్‌వాష్‌లు కూడా వచ్చేశాయి. మొదట్లో యూకలిప్టస్ ఆకులతో ఈ ద్రవాలను తయారుచేశారు..
వియత్నాం మ్యూజియంలో దొరికిన ఒక ఫార్ములా 1500 సంవత్సరాల కిందటిది. అందులో మిరియాలు, పుదీనా, రాతి ఉప్పు, ఐరీష్‌పువ్వు లతో కలిపి చేసిన పొడిని వాడేవారని ఉందట.
ఇప్పుడు టూత్‌పేస్టు కేవలం దంతాలకే కాదు, సిడిలపైన గీతలను, షూలపైన, డైమండ్ రింగ్స్‌పైన మరకల్ని తొలగించడానికి కూడా వాడుతున్నారు.